బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 మే 2022 (19:27 IST)

డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం లేదు.. అసెంబ్లీ ముందు ఆత్మహత్యాయత్నం

telangana secretariat
డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం లేదనే మనస్తాపంతో తెలంగాణ అసెంబ్లీ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న అసెంబ్లీ సిబ్బంది అడ్డుకుని, అతన్ని రక్షించారు. 
 
పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పీఎస్ కు తరలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
 
గతంలో కూడా తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి అసెంబ్లీ ఎదుట నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో బందోబస్తులో భాగంగా అక్కడే ఉన్న పోలీసులు అతన్ని కాపాడి ఆస్పత్రికి తరలించారు.