బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మే 2022 (17:00 IST)

పీకే వీరాభిమాని అంటే ఇతనే... జనసేన మేనిఫెస్టోతో శుభలేఖ

wedding card
సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానులు ఉన్నారు. వీరిలో కొందరు పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ అన్నా ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనుకంజ వేయరు. అలాంటివారిలో ఈ వీరాభిమాని ఒకరు. తన పెళ్లి ఆహ్వాన పత్రికలో ఏకంగా జనసేన మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలను ముద్రించారు. 
 
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన కోటే హరీష్ బాబు జనసేన పార్టీ వీరాభిమాని. తన అభిమానాన్ని ఆయన వినూత్న రీతిలో చాటుకున్నారు. తన వివాహం కోసం ముద్రించిన శుభలేఖలోని పై భాగంలో జనసేన పార్టీ మేనిఫెస్టో, గుర్తు, పవన్ ఫోటోలను ముద్రించగా, శుభలేక కింద భాగంలో పెళ్లి ముహూర్తం వివరాలను తెలియజేశారు. 
 
పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రాణమని, ఆయన సిద్ధాంతాలకు తనకు ప్రేరణ కలిగించాయని హరీష్ బాబు అంటున్నాడు. అటు మేనిఫెస్టోతో ముద్రించిన ఈ శుభలేక అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ శుభలేక సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం హరీష్ బాబు జనసేన పార్టీ లీగల్ సెల్ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు.