సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 2 మే 2022 (12:39 IST)

స‌ల్మాన్ ఖాన్‌కు పోటీగా జ‌గ‌ప‌తిబాబు!

Jagapati babu lezend
Jagapati babu lezend
తెలుగు సినిమా స్థాయి ప్ర‌పంచ‌స్థాయిని ఆక‌ర్షించింది. రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా వ‌చ్చిన బాహుబ‌లి, బాహుబ‌లి2, ఆర్‌.ఆర్‌.ఆర్‌.తో తెలుగు సినిమా స్థాయి పెరిగింది. అయితే అంద‌రూ పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్ ఇలా అన్ని వుడ్‌ల నుంచి న‌టీన‌టులు వ‌స్తున్నారు. కానీ తెలుగు న‌టులు పెద్ద‌గా ఆయా వుడ్‌ల‌లో న‌టించిన దాఖ‌లాలు లేవు.
 
దీనిపై ఎప్ప‌టినుంచో పెద్ద చ‌ర్చ న‌డుస్తుంది. ఇత‌ర వుడ్‌ల‌నుంచి తెలుగు విల‌న్లు రావ‌డంతో మ‌న‌కు ప‌ని త‌గ్గిపోయింది. కోట్లు పెట్టి మ‌నం వారిని పోషిస్తున్నామంటూ కోట శ్రీ‌నివాస‌రావుతోపాటు ప‌లువురు విమ‌ర్శించిన సంద‌ర్భాలూ వున్నాయి. అయితే తాజాగా జ‌గ‌ప‌తిబాబు బాలీవుడ్ ఎంట్రీ సిద్ధ‌మైంది.
 
జ‌గ‌ప‌తిబాబును `లెజెండ్‌` సినిమాలో విల‌న్‌గా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ప‌రిచ‌యం చేశారు. ఆ త‌ర్వాత నుంచి ఆయ‌న‌కు అన్నీ విల‌న్ పాత్ర‌లే వ‌స్తూన్నాయి. భిన్న‌మైన వాయిస్ ఆహార్యం ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చింది. అందుకే బాలీవుడ్ స‌ల్మాన్ ఖాన్‌కు జ‌గ‌ప‌తిబాబు న‌చ్చిన‌ట్లున్నాడు. ఆయ‌న సినిమాకు విల‌న్‌గా జ‌గ‌ప‌తిబాబు చేయ‌నున్న‌ట్లు తెలిసింది. ఇది పాన్ ఇండియా సినిమాగా రూపొంద‌బోతోంది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.