సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (12:17 IST)

త్రివిక్ర‌మ్‌కు డెడ్‌టైన్ పెట్టిన మ‌హేష్‌బాబు!

Maheshbabu, Trivikram Srinivas
Maheshbabu, Trivikram Srinivas
సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు సినిమాల విష‌యంలో ఇప్పుడు ఖ‌చ్చితంగా వుంటున్నాడు. రెండేల్ళ‌పాటు క‌రోనావల్ల సినిమా వాయిదాప‌డుతూ ఆఖ‌రికి స‌ర్కారివారి పాట మే 12న విడుద‌ల‌కాబోతుంది. ఈ చిత్రం త‌ర్వాత ఆయ‌న త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో క‌మిట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన పూజ కార్య‌క్ర‌మాలు కూడా జ‌రిగాయి. అయితే ఈ సినిమా త్వ‌ర‌గా సెట్‌పైకి వెళ్ళేలా చూడాల‌ని మ‌హేస్‌బాబు డెడ్‌లైన్ పెట్టారు. ఎందుకంటే ఈ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న సినిమా చేయ‌నున్నాడు.
 
ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ దాదాపు ముగింపు ద‌శ‌కు చేరుకుంద‌ని తెలుస్తోంది. ఆయ‌న టీమ్ ఇందుకు ప‌గ‌లు, రాత్రి క‌థ‌పై మెరుగులుదిద్దే ప‌నిలో వున్నారు. జూన్ లేదా జులైలో సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి ఏడాదిముగింపులో సినిమా విడుద‌ల‌కు ప్లాన్ చేయాల‌ని మ‌హేష్‌బాబు చెప్పిన‌ట్లు తెలిసింది.
 
ఈ సినిమానే బేస్ చేసుకుని రాజ‌మౌళి సినిమాకు డేట్స్ ఇచ్చాడు మ‌హేష్ బాబు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌పంచంలోని ఇప్ప‌టివ‌ర‌కు కొన్నిచోట్ల మ‌హేస్‌బాబు సినిమాలు వెల్ళ‌లేదు. అక్క‌డ‌కూడా ఈ సినిమాను తీసుకెల్ళే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు గ‌తంలో ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ తెలిపారు. ఈ సినిమాకోసం రాజ‌మౌళి 800 కోట్ల బ‌డ్జెట్‌ను నిర్మాత‌ల‌కు కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. ఉన్న‌త ప్ర‌మాణాల‌తో కూడిన ఈ సినిమాను ఈఏడాది క్రిస్‌మ‌స్‌కు కానీ వ‌చ్చే సంక్రాంతికిగానీ ప్రారంభించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.