తిరుమలలో బాలుడు కిడ్నాప్.. ఒక మహిళ బాలుడిని ఎత్తుకుని?
తిరుమలలో ఓ బాలుడు కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. శ్రీవారి ఆలయానికి వచ్చిన, అక్కడ ఆలయానికి ఎదురుగా కూర్చున్న ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ గురవడం స్థానికంగా ఆందోళన కలిగించింది.
తిరుపతి దామినేడుకు చెందిన గోవర్ధన్ రాయల్ అనే ఐదు సంవత్సరాల బాలుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట కిడ్నాప్‌కు గురయ్యాడు. ఆదివారం సాయంత్రం 5.45 నిమిషాలకు బాలుడి కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది.
సైలెంట్‌గా వచ్చిన ఒక మహిళ బాలుడిని ఎత్తుకొని అక్కడి నుండి ఉడాయించింది. శ్రీవారి ఆలయం ఎదురుగా బాలుడు కూర్చుని ఉండగా మహిళ బాలుడిని కిడ్నాప్ చేసింది. అప్పటివరకు తమతో ఉన్న కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు లబోదిబోమన్నారు.