సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 మే 2022 (16:33 IST)

రేపల్లె రైల్వే స్టేషన్‌లో అత్యాచారం కేసులో మైనర్ బాలుడు!

arrest
ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషనులో శనివారం అర్థరాత్రి ఓ వలస కూలీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు కామాంధులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విజయకృష్ణ, నిఖిల్‌తో పాటు ఓ మైనర్ బాలుడు ఉన్నాడు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ వకుళ్ జిందాల్ వెల్లడించారు. 
 
శనివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో స్టేషన్‌లో నిద్రపోతున్న ఈ దంపతులను నిద్రలేపిన కామాంధులు.. బాధితురాలి భర్తను టైమ్ అడిగారు. తన వద్ద వాచీ లేదని చెప్పడంతో అతనితో గొడవ పడ్డారు. అతన్ని కొట్టి అతనివద్ద ఉన్న రూ.750ను లాక్కున్నారు. పిమ్మట బాధితురాలిని జుట్టుపట్టుకుని లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
 
అయితే, స్థానికుల సహకారంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు జాగిలం, ఇతర మార్గాల ద్వారా ఆధారాలు సేకరించి నిందితులను గుర్తించామని తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.