సంబంధిత వార్తలు
- కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్
- మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్
- ఈ ఏడాది సక్సెస్ లు పెద్దగా లేవు, పారితోషికం గురించి అందరూ ఆలోచించాలి: దిల్ రాజు
- నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్
- Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ లో గ్రే షేడ్స్ తో డా. రాజశేఖర్
గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?
Revanth - Dil Raju
రజాకార్ అనే సినిమాను గత ఏడాది తీసినందుకు ఆ చిత్రంలో ఆర్ట్ డిపార్ట్ మెంట్ కు రావాల్సిన గుర్తింపు సరిగ్గా రాలేదు. మరో ఆంధ్ర సినిమాకు వచ్చింది. ఇలా పలు శాఖలలో తమకు అన్యాయం జరిగింది. తెలంగాణ ఫిలిండెవలప్ మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడు ద్రుష్టికి తీసుకు వచ్చినా లాభంలేకపోయింది. ఎదుకంటే ఆయనా అగ్ర నిర్మాతే కావడం వల్లే తమ విన్నపం సరిగ్గా కార్యరూపం రాల్చలేదని తెలుస్తోంది.
ఇక నిన్న రాత్రి టి.ఎఫ్.డి.సి. ఛైర్మన్ హోదాలో దిల్ రాజు మాట్లాడుతూ, 14 ఏల్ళ నుంచి తెలంగాణలో అవార్డులు ఇవ్వలేదని ఇప్పుడు ఇవ్వడం మంచి పరిణామం అంటూ.. శనివారం హైటెక్స్ నోవాటెల్ లో గ్రాండ్ గా జరుగుతుందని తెలిపారు. తన సినిమాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యత ఇచ్చే ఆ నిర్మాత అవార్డు విషయంలో ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారో అర్థంకాలేదు.
ఇక రేవంత్ రెడ్డి చుట్టుపక్కల వారు కూడా ప్రాంతీయాభిమానం మక్కువ. ఆమధ్య జర్నలిస్టుల సమావేశం జరిగినప్పుడు ఆంద్ర వారి వల్ల తమకు ఇండ్ల స్థలాలు రావడంలేదనీ వాపోయారు. దాదాపు 18 ఏళ్ళ నాడు ఉమ్మడి రాష్ట్రం వున్నప్పుడు అందరికీ రావాల్సిన స్థలాలను కొందరు ప్రత్యేకంగా ప్రాంతీయవాదం ముందుకు తెచ్చి కోర్టులో కేసు కూడా వేసినట్లు తెలిసింది. అలాంటిది గద్దర్ అవార్డులో ఎందుకు మౌనం వహించారనేది సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
