సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (16:21 IST)

గుంటూరు జిల్లాలో దారుణం.. ఆలయంలో నిద్రిస్తున్న మహిళపై..

rape victim
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ కూలీ పనుల కోసం దుగ్గిరాలకు వచ్చింది. అదే గ్రామంలోని ఆలయంలో ఆమె నిద్రిస్తోంది.
 
ఈ నేపథ్యంలో బైక్ పై అటుగా వెళ్లిన యువకులు నిద్రిస్తున్న మహిళను బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమెపై అఘాయిత్యం చేయడానికి యత్నించారు. బాధిత మహిళ కేకలు వేయడంతో యువకులు పారిపోయారు. తోటి కూలీలు డయల్ 100 కు ఫోన్ చేసి యువకులపై ఫిర్యాదు చేశారు.
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని బైక్ నెంబర్ ఆధారంగా యువకులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.