తమిళనాడులో ఘోరం - రథోత్సవంలో అపశృతి - 11 మంది మృతి
తమిళనాడు రాష్ట్రంలో ఘోరం జరిగింది. తంజావూరు నగరంలో జరిగిన ఓ ఆలయ రత్సవంలో అపశృతి చోటుచేసుకోవడంతో 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ జిల్లాలోని కలియమేడు అప్పర్ ఆలయ రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్ తగిలి 11 మంది సజీవదహనమయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అప్పర్ గురపూజై (అయ్యప్ప స్వామి పండుగ)ను పురస్కరించుని ప్రతి యేటా ఇక్కడ రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు రథాన్ని వీధుల గుండా లాగుతుండగా, ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ తీగలకు రథం తగిలింది.
దీంతో ఒక్కసారికా విద్యుదాఘాతానికి గురికావడంతో 11మంది భక్తులు కాలి బూడిదయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.