మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (16:00 IST)

ప్రేమ కోసం పురుషుడిగా మారిన మహిళ.. ప్రియురాలు కాదు పొమ్మంది..

Love
ప్రేమ కోసం పురుషుడిగా మారిన మహిళ ప్రియురాలి చేతిలో మోసపోయిన ఘటన తమిళనాడు మదురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మదురై మీనాక్షినగర్ ప్రాంతానికి చెందిన జయసుధకు సెంథిలతో అనే మహిళతో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 
 
ఇందుకోసం పురుషుడిగా మారాలని జయసుధపై సెంథిల ఒత్తిడి చేసింది. 2021లో మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో జయసుధ శస్త్రచికిత్స చేయించుకుంది. తన పేరును ఆదిశివగా మార్చుకుంది. ఆపై వీరిద్దరి పెళ్లి కూడా జరిగింది. 
 
అయితే ఈ విషయం సెంథిల తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు తిరుప్పరకుండ్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులతో వెళ్లిపోతానని సెంథిల చెప్పింది. దీంతో మోసపోయానని గ్రహించిన ఆదిశివ న్యాయం కోసం కలెక్టర్‌‌కు వినతిపత్రం అందజేశాడు.