సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (19:19 IST)

అలా చేస్తే ఆచార్య ఇప్ప‌టికీ రిలీజ్ చేసేవాల్ళం కాదు - చిరంజీవి

chiranjeevi at set
chiranjeevi at set
మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య‌` సినిమా గురించి వేసిన ప్ర‌త్యేక సెట్ గురించి బుధ‌వారంనాడు వివ‌రించారు. ద‌ర్శ‌కుడ‌డు కొర‌టాల శివ క‌థ చెప్పిన‌ప్పుడే గుళ్ళు, గోపురాలు, మండ‌పాలు, ఆ ప‌క్క‌న జ‌ల‌పాతాలు ఇవ‌న్నీ చెప్పేస‌రికి ఇవ‌న్నీ ఎక్క‌డుంటాయి? అనే అనుమానం వ‌చ్చింది. చాలాకాలం ఆలోచించాక కోకాపేట‌లో మా స్థ‌లం గుర్తుకు వ‌చ్చింది.. అంటూ వివ‌రించారు.
 
Kokapeta set
Kokapeta set
కోకాపేట‌లో 20 ఎక‌రాల‌లో ధ‌ర్మస్థ‌లి టెంపుల్ సెట్ వేశాం. పాత‌కాలంనాటిది. కొండ‌లు, పచ్చ‌ద‌నం, ప‌క్క‌నే పెద్ద న‌ది, గూడారాలు, మండ‌పాలు, గాలిగోపురాలు, లోప‌ల అమ్మ‌వారి విగ్ర‌హం ఇవ‌న్నీ రియ‌ల్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాం.

Kokapeta set
Kokapeta set
సినిమాలో చూసేస‌రికి థ్రిల్‌కు గురయ్యాం. ఇలాంటి క‌థ‌ను రియ‌ల్ లొకేష‌న్‌లో చేయాలంటే ఇంకా షూటింగ్ కూడా పూర్తి అయ్యేదికాదు.
 
Kokapeta set
Kokapeta set
ఈ సెట్‌ను కుర్రాడు అయిన క‌ళాద‌ర్శ‌కుడు సురేష్ వేశాడు. త‌ను త‌మిళ‌నాడులోని చిదంబ‌ద‌రం నుంచి వ‌చ్చాడు. చిన్న‌త‌నం నుంచి గుడులు, గోపురాలు అన్నీ చూశాడు. అక్క‌డే ఆర్ట్ డైరెక్ష‌న్‌లో ప‌ని నేర్చుకున్నాడు. త‌నుకు అన్నీ విష‌యాలు బాగా తెలుసు. ఇండియాలోనే 20 ఎక‌రాల‌లో సినిమా కోసం వేసిన సెట్ కేవ‌లం హైద‌రాబాద్ కోకాపేట‌లోని ఆచార్య సెట్ మాత్ర‌మే అని చెప్పారు.