1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (18:24 IST)

ప్ర‌మోష‌న్‌తో అల‌సిపోయిన కొర‌టాల శివ‌

Koratala Siva
Koratala Siva
మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న `ఆచార్య‌` సినిమా గురించి ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఆస‌క్తిక‌ర కామెంట్ చేశాడు. బుధ‌వారం ఉద‌య‌మే విజ‌య‌వాడ‌లోని క‌న‌క‌దుగ్గ‌మ్మ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. అంత‌కుముందు ప్ర‌మోష‌న్‌లో భాగంగా ప‌లు టీవీ ఛాన‌ల్స్‌కూ, వ్య‌క్తిగ‌తంగా సెలెక్ట్ మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. ఇది త‌న‌కు కొత్త ఎక్స్ పీరియ‌న్స్‌గా చెబుతున్నాడు.
 
మంగ‌ళ‌వారంనాడే హైద‌రాబాద్‌లో పార్క్ హ‌య‌త్ హోట‌ల్లో చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి మీడియా ఇంట్రాక్ష‌న్ చేశారు. త‌ర్వాత బుధ‌వారంనాడే హైద‌రాబాద్ నుంచి గ‌న్న‌వ‌రం, అటునుంచి విజ‌య‌వాడ వెళ్లి తిరిగి సాయంత్రం  4గంట‌ల‌క‌ల్లా తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చారు. వ‌చ్చీరాగానే మ‌ర‌లా మీడియాలో ఇంట్రాక్ట్ అయ్యారు. 
 
ఈ సంద‌ర్బంగా చాలా స్పీడ్‌గా ప్ర‌మోష‌న్ కోసం ప‌రుగెడుతున్నారే అని ప‌లుక‌రిస్తే, అవును. చాలా స్పీడ్‌గానే వుంది అన్నారు. మ‌ర‌లా ఎక్క‌డికి వెళుతున్నారు? అని అడిగితే, వెంట‌నే.. హాయిగా రామ‌కృష్ణ మిష‌న్‌కు వెళ్ళి కూర్చుంటా అంటూ చ‌లోక్తి విసిరారు. అంటే ఈ స్పీడ్ యుగంలో ఇంత‌కుముందులేని ప్ర‌మోష‌న్‌ను తాను చేయాల్సి వ‌చ్చింద‌ని 45 ఏళ్ళ కొర‌టాల శివ తెలియ‌జేస్తున్నారు.