మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మే 2022 (21:55 IST)

మందుబాబులకు షాకింగ్ వార్త... 15 రోజుల పాటు షాపులుండవు..

beer
మందుబాబులకు షాకింగ్ వార్త. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించారు మద్యం వ్యాపారులు.

ఇందులో భాగంగా మే ఆరో తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. ఈ మేరకు డివిజన్ స్థాయిలో మద్యం కొనుగోళ్లను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయంపై ఈ సమ్మె జరుగుతుంది. 
 
ఇందులో భాగంగా లిక్కర్ డీలర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. మే 19 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర పోరాటాలు సాగిస్తామని లిక్కర్ డీలర్లు అంటున్నారు.

కేఎస్‌పీసీఎల్ ఎండీ తుగ్లక్ దర్బార్ నడుపుతున్నారని, ముఖ్యమంత్రిని , ఎక్సైజ్ శాఖా మంత్రి కలవనివ్వట్లేదని మండిపడుతున్నారు.