బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2022 (18:27 IST)

కర్ణాటకలో కరోనాతో నాలుగో వేవ్‌ ముప్పు తప్పదు

Corona
కరోనాతో నాలుగో వేవ్‌ ముప్పు తప్పదని డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే హెచ్చరించింది. కరోనా మ్యుటెంట్ "ఎక్స్ఈ"కి మరింత వేగంగా వ్యాపించే గుణం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. 
 
ఈ  నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో జూలైలో కొవిడ్‌ నాల్గవ వేవ్‌ వచ్చే సంకేతాలు ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరికలు జారీ చేశారు.
 
త్వరలోనే తాజా మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు బెంగుళూరు ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కె. సుధాకర్‌ మీడియాకు తెలియజేశారు.

కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క రెండవ మోతాదును ఇంకా పొందని వ్యక్తులు వీలైనంత త్వరగా అలా చేయాలని ప్రభుత్వం కోరింది. గతంలో కోవిడ్-19 వేవ్, వ్యాక్సిన్ల కొరతకు ప్రభుత్వం కారణమని కొందరు ఆరోపించారు.

ఇప్పుడు, తగినంత సరఫరా ఉందని, అందుచేత ప్రజలు వ్యాక్సిన్ తీసుకొని ప్రభుత్వానికి సహకరించాలని కర్ణాటక అధికారులు తెలిపారు.