శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (20:32 IST)

కర్ణాటకలో 16 ఏళ్ల బాలికపై 8 మంది అత్యాచారం

rape
దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కఠినమైన చట్టాలు వచ్చినా అత్యాచారాలకు అడ్డుకట్ట పడట్లేదు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. 
 
యలహంక ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికపై 8 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీసి బాలికను బెదిరించారు. ఓ రోజు బాలిక ఇంటికి ఏడ్చుకుంటూ రావడాన్ని తల్లిదండ్రులు గమనించారు. 
 
ఆరా తీయగా కబాబ్ కారంగా ఉండటంతో ఏడ్చానని తెలిపింది బాలిక. అయితే ఆలస్యంగా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.