బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 మార్చి 2022 (08:38 IST)

శ్రీశైలంలో దుకాణాలకు నిప్పు పెట్టిన కన్నడ భక్తులు

పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని దుకాణాలకు కర్నాటకకు చెందిన భక్తులు వ్యక్తులు నిప్పు పెట్టారు. టీ దుకాణం వద్ద స్థానిక, కన్నడ భక్తుల మధ్య ఏర్పడిన చిన్న వివాదమే కారణం. కర్నాటక యువకుడిపై స్థానికులు గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కన్నడ భక్తుడుని ఆస్పత్రికి తరలించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మొహరించారు. 
 
టీ దుకాణం వద్ద ప్రారంభమైన చిన్నపాటి గొడవ పెద్దదిగా మారింది. దీంతో తాత్కాలిక దుకాణాలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై దాడికి కారణమైంది. ఆ తర్వాత ఆగ్రహంతో ఊగిపోయిన కన్నడ భక్తులు టీ దుకాణానికి నిప్పు పెట్టారు. దీంతో కర్నాటక భక్తుడిపై స్థానికులు గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 
 
దీంతో ఆగ్రహించిన కన్నడ భక్తులు దుకాణాలకు నిప్పుపెట్టారు. ఫలితంగా ఆలయ పరిసరాలతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పాతాళగంగ, నంది సర్కిల్, పరిపాలనా విభాగం ముందు పైపు లైన్లతో పాటు తాత్కాలిక షాపులు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.