ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 మార్చి 2022 (11:08 IST)

యువతకు బంపర్ ఆఫర్.. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలి

టీడీపీ ఆవిర్భావం దినోత్సవం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించనున్నారు. ఇందుకోసం 83 ఫార్ములాను తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యంపై టీడీపీ చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 
 
1983లో వచ్చినట్లు మళ్ళీ యువత క్రీయాశీల రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీకి మరో 40 ఏళ్లకు సరిపోయే నాయకత్వం ఇస్తామని తెలుగుదేశం 40వ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు స్పష్టంచేశారు.
 
దీనిలో భాగంగా వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇస్తానని.. న్యాయం కోసం పోరాడాలంటూ చంద్రబాబు సూచించారు. పేదరికం పోవాలన్నా, సామాన్య ప్రజల కష్టాలు తీరాలన్నా తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు పేర్కొన్నారు. 
 
హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం 40వ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ అధినేత చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గాడ్‌ ఫాదర్‌ లేడని భయపడొద్దని.. సమాజహితం, రాజకీయాల్లో మార్పు తేవాలనుకుంటున్న వారు రాజకీయాల్లోకి రావాలని.. ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.