1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 మే 2022 (18:14 IST)

బెంగళూరు, మంగళూరు ఎయిర్‌పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి

flight
కరోనా ఫోర్త్ వేవ్‌లో భాగంగా కర్ణాటకలో కోవిడ్ నియంత్రణకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీపీసీఆర్ ద్వారా పరీక్షలు నిర్వహించనుంది. పాజిటివ్ వచ్చిన వారికి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
 
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. 
 
ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ (జపాన్, థాయ్ లాండ్ నుంచి వచ్చే ప్రయాణీకులు) కాల్ సెంటర్ ద్వారా 14 రోజుల పాటు ఐసోలేషన్ తప్పదు.