బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (16:17 IST)

డైరక్టర్ శంకర్ కుమార్తెకు ఆఫర్ల వెల్లువ... పాట కూడా పాడిందట

Aditi Shankar
Aditi Shankar
సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తండ్రిలాగా మెగాఫోన్ పడుతుందనుకుంటే నటిగా తన సత్తా చాటాలనుకుంటోంది.
 
కార్తీ నటిస్తోన్న 'విరుమాన్' సినిమాతో అదితి శంకర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఆగస్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నటించడంతో పాటు ఓ పాట కూడా పాడింది అదితి. ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఆమెకి మరో సినిమా ఆఫర్ వచ్చింది.
 
కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా 'మావీరన్'. మడోన్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఓ బైలింగ్యువల్ ప్రాజెక్ట్. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
 
తెలుగులో ఈ సినిమాకి 'మహావీరుడు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా అదితి శంకర్‌ను ఎంపిక చేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాతో అదితి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించబోతుంది.