శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (15:58 IST)

ఎన్టీ రామారావు నాలుగో కుమార్తె ఉమా మహేశ్వరీ మృతి

NTR Daughter
NTR Daughter
దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నాలుగో కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరీ మృతి చెందారు. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో ఆమె చనిపోయారు. ఉమామహేశ్వరి మృతితో ఎన్టీఆర్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 
 
ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తెకు వివాహం జరిగింది. ఈలోపే ఇంతటి విషాదం జరగడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఉమామహేశ్వరి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తున్నారు.
 
ఎన్టీఆర్‌కు మొత్తం 12 మంది సంతానం. అందులో 8 మంది కొడుకులు, నలుగురు కూతుర్లు. వీళ్ళలో కొందరు మనకు తెలుసు హరికృష్ణ , బాలకృష్ణ హీరోలుగా మారిన విషయం సైతం అందరికి తెలిసిందే. 
 
ఇక కూతుళ్లు, భువనేశ్వరి, పురంధేశ్వరి గురించి కూడా మనకు తెలుసు. ఎన్టీఆర్ మరో కూతురు మరొక కూతురు లోకేశ్వరి కాగా చిన్న కూతురు ఉమా మహేశ్వరీ కావడం గమనార్హం.