శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 జులై 2022 (09:28 IST)

నేడు హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు

mmts train
హైదరాబాద్ నగరంలో నడిచే లోకల్ రైలు సర్వీసుల్లో ఎంఎంటీఎస్ సర్వీసుల్లో కొన్నింటిని నేడు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వివిధ రకాలైన మరమ్మతులు, ఇంజనీరింగ్ పనుల కారణంగా వీటిని రద్దు చేసినట్టు పేర్కొంది. 
 
రద్దు చేసిన రైలు సర్వీసుల్లో లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో నడిచే 9 సర్వీసులు, హైదరాబాద్ - లింగంపల్లి రూట్‌లో నడిచే 9 సర్వీసులు, ఫలక్‌నుమా - లింగంపల్లి మార్గంలో నిడిచే 7 సర్వీసులు, లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో ఏడు సర్వీసులు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 
 
అలాగే, సికింద్రాబాద్ - లింగంపల్లి, లింగంపల్లి - సికింద్రాబాద్ మార్గంలో ఒక్కో సర్వీసును రద్దు చేసినట్టు పేర్కొంది. నిర్వహణ సర్వీసుల కారణంగా ఈ సర్వీసులను రద్దు చేశామని, ప్రయాణికులు సహకరించాలని దక్షిణ రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.