గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

నేడు యథాతథంగా హైదరాబాద్ మెట్రో రైళ్ల రాకపోకలు

hyderabad metro
హైదరాబాద్ నగరంలో ఆదివారం మెట్రో రైల్ సేవలు ఆపివేస్తున్నట్టు వచ్చిన వార్తలను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కొట్టివేసింది. మెట్రో రైల్ సర్వీసులన్నీ ఆదివారం యథాతథంగా నడుస్తాయని ప్రకటించింది. 
 
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని హైదరాబాద్‌ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా భద్రతా రీత్యా రెండురోజులు మెట్రోసేవలు బంద్‌ అని సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. దీన్ని మెట్రో అధికారులు ఖండించారు.
 
రోజువారీ మాదిరిగానే ఆదివారం మెట్రో రైళ్లు మూడు కారిడార్లలో యథాతథంగా నడుస్తాయని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. అయితే, ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన అమలు చేస్తున్నారు. ఈ కారణంగా వాహనచోదకులు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.