పవిత్ర లోకేష్, సీనియర్ నరేష్ రిలేషన్ షిఫ్ నిజమే- మాజీ భార్య రమ్య ఆరోపపణ
Pavitra Lokesh, Sr. Naresh, Ramya Raghupathi,
గత కొంతకాలంగా పవిత్ర లోకేష్, సీనియర్ నరేష్ పై పలు రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారనీ, త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్త హల్‌చల్ చేసింది. వీరిద్దరికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దాంతో పవిత్ర లోకేష్ బెంగుళూరులో పోలీసు అధికారిని కలిసి ఇలాంటి వార్తలు రాసేవారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవలే కోరింది. ఆ తర్వాత బెంగుళూరులో వుంటున్న సీనియర్ నరేష్ మొదటి రమ్య రఘుపతి కూడా ఘాటుగానే స్పందించింది. ఇద్దరి రిలేషన్ నిజమేనంటూ పేర్కొంది.
దీనిపై రమ్యరఘుపతి చేసిన ఆరోపణలపై నటి పవిత్ర లోకేష్ తాజాగా వివరణ ఇచ్చింది. నేనేమిటో నాకు గురించి తెలుగు ప్రేక్షకులు తెలుసు. నరేష్ గారు, వారి కుటుంబం గురించి కూడా తెలుగు వారికి తెలుసు. రమ్యరఘుపతి నా గురించి కన్నడలో చాలా తప్పుగా ప్రచారం చేశారు. నరేష్ గారు, నేను రిలేషన్ షిప్ లో ఉన్నామని ప్రచారం చేసిన రమ్య నన్ను ఓ బాదితురాలిని చేశారు. కుటుంబ వ్యవహారాలు కుటుంబంలోనే సరి చేసుకోవాలి. రమ్యరఘుపతి మాటలు నన్ను ఎంతగానో బాధించాయి.