కొలిక్కి రాని సినీ కార్మికుల సమస్యలు - లీకయిన నిర్మాతల రూల్స్
Telugu Film Chamber of Commerce,
ఇటీవలే తెలుగు సినీ రంగంతోపాటు తమిళరంగంలోనూ సినీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం షూటింగ్‌లకు వెళ్ళకుండా మొరాయించిన కార్మికుల గురించి తెలిసిందే. తమకు ఇప్పుడు ఇస్తున్న పారితోషికం సరిపోవడంలేదని అందుకే అందరికీ 45 శాతం పెరుగుదల చేయాలని కార్మికుల సంఘాల నాయకులతో 24 క్రాఫ్ట్ పోరాటం చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల చర్చల అనంతరం సినిమాటోగ్రపీ మంత్రి శ్రీనివాస యాదవ్ చొరవతో తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీలో సి.కళ్యాణ్, దామోదరప్రసాద్‌తోసహా పలువురు కార్మికులు అడుగుతున్న 45 శాతం పెంపుదల ఇచ్చేది లేదని తేల్చారు. అనంతరం మంత్రి చొరవ తీసుకోవడంతో దిల్‌రాజు ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
ఇది జరిగిన పదిరోజులు అవుతున్నా ఇంతవరకు దిల్ రాజు కమిటీ ఒకడుగుకూడా ముందుకు సాగలేదు. ఇంకా చర్చిస్తున్నామని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అసలు ఈ చర్చలకు ముందు చాలా నెలలకు ముందే నిర్మాతలమండలి, ఛాంబర్ ఆప్ కామర్స్ ఆధ్వర్యంలో కొన్ని రూల్స్ పెట్టారు. అవి 24 క్రాఫ్ట్‌కు తెలీయదు. కానీ ఈరోజే ఆ చర్చల సారాంశం బయటకు లీకయింది. దీన్ని బట్టి చూస్తే, కార్మికుల వేతనాలు పెంపుదల, ఇతర నియమనిబంధనలు అంటూ నోరెత్తితే వారిని భయపెట్టేవిగా రూల్స్ వున్నాయి. అవి ఏమిటో ఈ క్రింది తెలియజేయపడ్డాయి.
ఇవన్నీ కనుక అమలు చేస్తే, 24 క్రాఫ్ట్ ల కార్మికులే నష్టపోతారని ఓ కార్మిక నాయకుడు తెలియజేస్తున్నాడు. అందుకే వారు ఎంత పెంచితే అంతే తీసుకోవాలని తెలియజేసేలా బెదిరింపుగా ఈ రూల్స్ వున్నాయని కార్మికులు అంటున్నారు.