శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (15:43 IST)

మేనేజర్లను విసిగిస్తున్న శ్రీలీల.. ఎందుకో తెలుసా?

sree leela
యంగ్ బ్యూటీ శ్రీలీల స్టార్ డమ్‌ను సొంతం చేసుకుంది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం కమర్షియల్‌గా కాస్త వెనుకబడినా.. శ్రీలలకు మాత్రం సూపర్ క్రేజ్ వచ్చేసింది. 
 
దీంతో ఆమె వరస సినిమాల్లో లీడ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. నితిన్ 32వ సినిమాలో, రవితేజ "ధమాఖా", అనగనగా ఒక ధీరుడు, వైష్ణవ్ తేజ్ నాల్గవ సినిమాలో, ఇంకా దుబారి అనే కన్నడ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
 
చేతిలో ఐదు సినిమాలు, చర్చల్లో ఇంకొన్ని సినిమాలున్నాయి. కానీ, శ్రీలీల మాత్రం ఇంకా ఏదో కావాలని తన మేనేజర్లను ఇబ్బంది పెడుతుందట. ఎన్టీఆర్, రాంచరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలిప్పించమని మేనేజర్లను విసిగిస్తోందట.