శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 1 ఆగస్టు 2022 (18:33 IST)

సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య

NTR Daughter
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 
ఈ వార్త తెలియగానే చంద్రబాబునాయుడు, నందమూరి కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. ఎన్టీఆర్‌కు 12 మంది సంతానం కాగా అందులో 8 మంది కుమారులు, నలుగురు కూతుళ్లు. కూతుళ్ళలో ఉమామహేశ్వరి అందరికన్నా చిన్నవారు. ఇటీవలే ఆమె తన కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమె ఇంటికి మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో చేరుకున్నారు.