ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 30 జులై 2022 (14:33 IST)

కొత్తకారు కోసం భార్యకు వేధింపులు: ఉరి వేసుకుని ఆత్మహత్య

woman
ఇటీవలి కాలంలో పలువురు కార్లు, టీవీలు, ఇంట్లో ఇతర సౌకర్యాల కోసమే బతుకుతున్నట్లు పలు ఘటనలు చెపుతున్నాయి. ఉన్నదాంతో సర్దుకుని పోకుండా లేనివాటి కోసం ఆరాటపడుతూ ఇంట్లో భార్యపైనో లేదంటే భర్తపైనో ఆవేశం, ఆగ్రహం చూపించి కాపురాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే జరిగింది.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... తెలంగాణ లోని కొండకరకం గ్రామానికి చెందిన 23 ఏళ్ల సునీతకు అదే ప్రాంతానికి చెందిన రమేష్‌తో 2019లో వివాహమైంది. రమేష్  హైదరాబాదులోని ఓ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం నాడు రమేష్ విధులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి భార్య తన పడకగదిలో ఫ్యానుకి ఉరి వేసుకుని కనిపించింది. దీనితో పోలీసులకు సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 
కాగా తమ కుమార్తెను అదనపు కట్నం కోసం వేధించారనీ, కొత్తకారు కొనుక్కునేందుకు రూ.10 లక్షలు కావాలంటూ ఆమె అత్తమామలు, భర్త తమ కుమార్తెను వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నదంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనితో భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.