శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (16:43 IST)

అదనపు కట్నం కోసం భార్యపై అత్యాచారం... ఎక్కడ?

rape
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే భార్యపై అత్యాచారం చేయించాడు. అదనపు కట్నం కోవం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించా
డు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లక్నోకు చెందిన మహమ్మద్ అద్నాన్ అనే వ్యక్తి​తో కొన్నాళ్ల క్రితం  బాధితురాలితో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.30 లక్షల కట్నం ఇచ్చారు. అయినా అది చాలదన్నట్లు అదనపు కట్నం కోసం అక్రమ్ తన భార్యను నిత్యం వేధించేవాడు. రంజాన్ పండగ సందర్భంగా రూ.10 లక్షలు తీసుకురమ్మని బాధితురాల్ని డిమాండ్ చేశాడు. పుట్టింటికి వెళ్లిన ఆమెను కొన్ని రోజుల తర్వాత ఇంటికి పిలిచాడు. 
 
అద్నాన్, అతని బంధువులు మంగళవారం బాధితురాలి కన్నవారింటికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిషేధించినా.. ముమ్మారు తలాక్ చెప్పి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు కేసు నమోదు చేసిన పోలీసులు... గురువారం నిందితుడు అక్రమ్‌ను అరెస్టు చేశారు. అలాగే, అత్యాచారానికి పాల్పడి పరారీలో ఉన్న అద్నాన్ బంధువుల కోసం గాలిస్తున్నారు.