సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (11:42 IST)

పెళ్లంటేనే ఒక కేజీఎఫ్.. భవిష్యత్తులో ప్రేమా లేదు దోమా లేదు.. సమంత

Samantha
'కాఫీ విత్‌ కరణ్‌' షోలో పాల్గొన్న సమంత తన వ్యక్తిగత వివరాలను వెల్లడించింది. నటుడు నాగచైతన్యతో విడాకులు తీసుకోవడంపై సమంత మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో పెదవి విప్పింది. తాము విడిపోవడం అంత సులభంగా జరగలేదన్నారు. తమ మధ్య సఖ్యత లేదని వెల్లడించింది.  
 
విడిపోయిన సమయంలో మనోవేదనకు గురయ్యా. ప్రస్తుతం బాధ నుంచి బయటపడ్డా. మునుపెన్నడూ లేనివిధంగా దృఢంగా సిద్ధమయ్యానని సమంత చెప్పింది.
 
మేము విడిపోయిన కొన్నిరోజులకే 'ఊ అంటావా' సాంగ్‌ ఆఫర్‌ వచ్చింది. ఆ పాట తనకెంతో నచ్చింది. అందుకే అందులో యాక్ట్‌ చేశా. ఈ పురుషాధిక్య సమాజంలో వారిలోని లోపాలు ఎత్తిచూపించడానికి ఈ పాట సరైందని, తన లాంటి స్టార్‌ సెలబ్రిటీ చెబితే తప్పకుండా అందరికీ చేరువవుతుందని భావించానని సామ్ తెలిపింది. 
 
అలాగే భరణం తీసుకున్నాననే వార్తలను సమంత కొట్టిపారేసింది. అంతేకాకుండా భవిష్యత్తులో తాను ప్రేమలో పడే అవకాశం లేదని చెప్పుకొచ్చింది. వాస్తవానికి పెళ్లంటేనే ఒక కేజీఎఫ్ అని చెప్పుకొచ్చింది సామ్.
 
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది సమంత.. ఇప్పటికే శాకుంతలం సినిమాను కంప్లీట్ చేసిన సామ్.. ప్రస్తుతం యశోద, ఖుషి చిత్రాల్లో నటిస్తోంది.
 
ఇందులో ఒక్కపాట మినహా మిగిలిన చిత్రీకరణ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది యశోద. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచగా.. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తోంది. 
 
డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే అటు బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలోకి సైతం సామ్ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే తన నిర్మాణంలో సామ్ హిందీ ఫిల్మ్ చేస్తుందని కన్ఫార్మ్ చేసేసింది హీరోయిన్ తాప్సీ.