బుధవారం, 4 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (08:28 IST)

కామన్వెల్త్ క్రీడలు : హైజంప్‌లో భారత్‌కు తొలి మెడల్

tejaswini shankar
బర్మింగ్‌హ్యమ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భారత ఆటగాళ్లు క్రమం తప్పకుండా పతకాలు సాధిస్తున్నారు. తాజాగా హైజంప్‌లో భారత్‌కు తొలి పతకం వరించింది. హైజంప్ విభాగంలో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో హైజంప్ విభాగంలో దేశానికి మెడల్ సాధించిన తొలి అథ్లెట్‌గా తేజస్వీ రికార్డులకెక్కాడు. 
 
బుధవారం రాత్రి జరిగిన హైజంప్ ఫైనల్ పోటీల్లో 2.22 మీటర్ల ఎత్తును అలవోకగా దూకి అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ అథ్లెట్ జంప్‌చేసి మొదటి స్థానంలో నిలువగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు. 
 
అయితే, జూన్ నెలలో జరిగిన అథ్లెట్ల్స్ చాంపియన్‌షిప్‌లో శంకర్ 2.27 మీటర్ల దూరం జంప్ చేయడం గమనార్హం. గత రికార్డులతో పోల్చితే శంకర్ కామన్వెల్త్ క్రీడల్లో నిరశపరిచడం మగనార్హం. మొత్తంమీద శంకర్ ఓ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.