శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (15:13 IST)

కామన్వెల్త్ క్రీడల్లో మీనాక్షికి గాయం.. సైకిల్‌పై నుంచి కిందపడి..?

Meenakshi
Meenakshi
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత సైక్లిస్ట్ మీనాక్షి అనుకోని ప్రమాదానికి గురైంది. 10కి.మీ స్క్రాచ్ రేసు ఈవెంట్‌ మధ్యలో సైకిల్‌పై నుంచి మీనాక్షి పడిపోవడం, ఆవెంటనే ప్రత్యర్థి సైకిల్‌ ఆమెపై దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది.  అయితే పోటీ నిర్వాహకులు వెంటనే స్పందించి మీనాక్షిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. 
 
అంతకుముందు ఆదివారం జరిగిన సైక్లింగ్‌ పోటీల్లోనూ ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. పోటీల్లో భాగంగా పోటీ దారుడు ఏకండా సైకిల్‌తో ప్రేక్షకులపైకి దూసుకెళ్లడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా మీనాక్షి యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 
లీ వ్యాలీ వెలో పార్క్ వద్ద రెండు రోజుల్లో ఇది రెండో ప్రమాదం ఇది. అంతకుముందు ఇంగ్లండ్‌కు చెందిన మాట్ వాల్స్ కూడా ఈవెంట్‌లో సైకిల్‌పై నుంచి పడిపోయాడు. అతనికి కుట్లు పడ్డాయి. అదే సమయంలో కెనడాకు చెందిన సైక్లిస్టులు మాట్ బోస్టాక్, డెరెక్ జి కూడా ఆసుపత్రి పాలయ్యారు.