1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TS CS Somesh Kumar mother Meenakshi Singh Passed Away

తెలంగాణ ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్‌కు మాతృవియోగం

somesh kumar
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి మీనాక్షి సింగ్ (85) సోమవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ గత మూడు వారాలుగా హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
కాగా, ఆమె పార్థివదేహానికి బీహార్ రాష్ట్రంలోని సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, మీనాక్షి సింగ్‌ మృతిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు తమ ప్రగాఢ సంతాన్ని, సానుభూతిని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలోని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నేడు సోనియా నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ