సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (12:32 IST)

ఎన్టీఆర్ కుమార్తె భౌతికకాయానికి సినీ రాజకీయ ప్రముఖుల నివాళులు

ntr daughter uma
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చిన్నకుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె భౌతికకాయం హైదరాబాద్ నగరంలోని ఆమె నివాసంలో ఉంచారు. అయితే, ఆమె భౌతికకాయానికి అనేక సినీ రాజకీయ ప్రమఖులు నివాళులు అర్పించారు. 
 
ముఖ్యంగా, ఆమె కుటుంబసభ్యులు, ఇతర ప్రముఖులు ఆమె నివాసానికి చేరుకుంటున్నారు. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఉమామహేశ్వరి కుటుంబసభ్యులు గారపాటి లోకేశ్వరి, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి కల్యాణ్‌రామ్ తదితరులు ఆమెకు నివాళులర్పించారు. 
 
అలాగే, నేత, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి తదితరులు ఉమామహేశ్వరి భౌతికకాయం వద్ద నివాళులర్పించి ఆమె కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు, తెలంగాణ పోలీసులు మాత్రం ఈ ఆత్మహత్య కేసును అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.