గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 ఆగస్టు 2022 (22:37 IST)

ప్రజలకు నీలి చిత్రాలు చూపించిన ఎంపీ జెండా ఎలా ఎగురవేస్తారు? గోరంట్లపై బాలయ్య ఫైర్

Nandamuri Balakrishna
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎంపి గోరంట్ల మాధవ్ పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే నీలి చిత్రాలు చూపించారంటూ మండిపడ్డారు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని స్వాతంత్ర్య వేడుకల్లో ప్రజల మధ్యకు వచ్చి జాతీయ జెండా ఎగురవేసారంటూ విమర్శించారు. అలాంటి ఎంపీ పైన ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసారు.

 
బాదుడే బాదుడు కార్యక్రమంలో బాలయ్య పాల్గొని ప్రసంగించారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజలను అడిగి అధికారంలోకి వచ్చిన జగన్, ప్రజలను మోసం చేసారని విమర్శించారు. ఎరువులు, విత్తనాలు రైతలకు అందటం లేదనీ, వాటిని రాయితీపై ఇవ్వడం లేదని అన్నారు.