సోమవారం, 29 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2025 (23:19 IST)

చార్మింగ్ స్టార్ శర్వానంద్ 36వ సినిమా- స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్‌గా లుక్ అదుర్స్

Sharwanand
Sharwanand
చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన 36వ మూవీలో స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్‌గా కనిపించబోతున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వంలో ప్రతిష్టాత్మక యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వా, టీమ్‌పై రేస్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 
 
ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా వుండబోతున్నాయి. ఈరోజు మేకర్స్ శర్వానంద్ పర్సనల్ స్టిల్స్‌ని విడుదల చేశారు. స్టైలీష్ మేకోవర్‌లో శర్వా లుక్స్ అదిరిపోయాయి. శర్వా ఫ్యాషన్‌ ట్రెండీ క్లాసీ లుక్‌లో ఆకట్టుకున్నారు.  
 
యూనిక్ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకునే శర్వా, ఈ చిత్రంలో ఓ ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఆడ్రినలిన్ రష్‌ని ఇచ్చే స్టంట్స్‌తో అదరగొట్టబోతున్నారు. ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటించగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ హై-ఎనర్జీ మూవీ మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్‍లో ఉండబోతోంది.
 
 ఈ చిత్రానికి జె యువరాజ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూ, ఎక్సయిటింగ్ విజువల్స్‌‌ని అందిస్తున్నారు. గిబ్రాన్ ఈ చిత్రానికి డైనమిక్ సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేస్తున్నారు. అనిల్ కుమార్ పి ఎడిటర్‌గా, ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్, ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్.