Chiranjeevi: మన శంకరవరప్రసాద్ గారు షూటింగ్ వాయిదాకు కారణం అదేనా..
Mana Shankaravara Prasad At set
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. కొద్దిరోజులు హైదరాబాద్ ఫిలింసిటీలో జరుపుకుంది. తాజాగా హైదరాబాద్ శివార్లో నిన్నటినుంచి షూటింగ్ జరగాల్సి వుంది. అయితే షడెన్ గా షూటింగ్ వాయిదా వేస్తూ చిత్ర టీమ్ నిర్ణయం తీసుకుందట. దానికి కారణం డాన్స్ డైరెక్టర్ తో వచ్చిన కొద్దిపాటి సమన్వయంలోపంగా తెలుస్తోంది. ఓ పాటను చిరంజీవి బ్రుందంపై చిత్రీకరించాల్సి వుంది. అయితే అందుకు కాస్ట్యూమ్స్ డిజైనర్ వల్ల చిన్న తప్పిదం జరగడంలో మొత్తం గందరగోళ పరిస్థితి నెలకొందని సమాచారం.
దానిలో పాటకు తగినట్లుగా కాస్ట్యూమ్స్ లేకపోవడంలో నటీనటులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దానితో తప్పనిసరి షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చిందట. నటీనటులు,ప్రొడక్సన్ అంతా వచ్చాక ఇలా జరగడం సినిమాల్లో కొన్నిసార్లు మామూలే. కానీ దీనివల్ల నిర్మాతకు చాలా నష్టం అనే చెప్పాలి.
ఇక ఈ సినిమా గతంలో చిరంజీవి చిత్రాల స్టయిల్ ను కంపేర్ చేస్తూ కొత్త తరహాలో చిరంజీవిని చూపించాలనే ప్రయత్నం దర్శకుడు చేస్తున్నాడు. పూర్తి వినోదాత్మకంగా వుంటుందని ఇప్పటికే దర్శకుడు స్టేట్ మెంట్ ఇచ్చాడు. వెంకటేష్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వీరి కాంబినేషన్ లోనే సాంగ్ ను తీయాలని అనుకున్న టైంలో షూటింగ్ వాయిదా పడడం విశేషంగా వుంది.
ఈ పాటను డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి కొరియోగ్రఫీ చేస్తారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి మొత్తం నలుగురు నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.