Chiru: శంకర్ దాదా జిందాబాద్ తరహాలో మన శంకరవర ప్రసాద్ సినిమా వస్తుందా!
mana Shankar Varaprasad garu styile
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో షూటింగ్ జరుపుకుంటున్న మన శంకరవరప్రసాద్ గారు చిత్రం పూర్తి వినోదాత్మకంగా వుంటుందని ఇప్పటికే దర్శకుడు స్టేట్ మెంట్ ఇచ్చాడు. వెంకటేష్ కు సంక్రాంతికి వస్తున్నాం తరహాలో చిరంజీవిని పూర్తిగా పిల్లలు, పెద్దలు చూసేట్లుగా తీయాలని కోరికను ఆయన వ్యక్తం చేశారు. ఆయనతో సీరియస్ మూవీలు చాలా మంది తీశారు. అయితే నేను సరికొత్తగా తీయనున్నాని తెలిపారు. గత కొద్దిరోజులుగా హైదరాబాద్ శివార్లో తీస్తున్న సన్నివేశాలు ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాల తరహాలో వుంటుందని తెలుస్తోంది.
mana Shankar Varaprasad garu styile
సెట్లో కొన్ని స్టిల్స్ ను దర్శకుడు బయట పెట్టాడు. ఆసుపత్రిలోనూ, సెలూన్ షాప్ లోనూ వుండే తరహా కుర్చీలు ఆయన కూర్చునే స్టయిల్ చిరంజీవి పెక్యూలర్ శైలిని పోలివున్నట్లు కనిపిస్తుంది. ఎదుటివారికి వార్నింగ్ ఇస్తూ తీస్తున్న ఈ సీన్ ను కెమెరా ఆయన చుట్టూ తిరుగుతూ కనిపిస్తుంది.
గత రెండురోజులుగా నయనతారపై చిత్రీకరించిన సాంగ్ నేటితో పూర్తయినట్లు కనిపిస్తుంది. మాస్-అప్పీల్ ట్రాక్‌లను అందించడంలో పాపులరైన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్‌ను రూపొందించారు. ఈ పాటను డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి కొరియోగ్రఫీ చేస్తారు. ఫస్ట్ లుక్, గ్లింప్స్, వినాయక చవితి స్పెషల్ పోస్టర్ అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. చిరంజీవిని స్టైలిష్ బెస్ట్ అవతార్‌లో ప్రజెంట్ చేయడం అభిమానులని అలరించింది.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.