శనివారం, 15 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 8 సెప్టెంబరు 2025 (07:55 IST)

Nayanatara: మన శంకరవరప్రసాద్ గారు నయనతార తో స్టెప్ లేస్తున్నారు

Mana Shankaravara Prasad, Megastar Chiranjeevi
Mana Shankaravara Prasad, Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి, నయనతారల నటిస్తున్న చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకుడు. ఇటీవలే కొంత భాగం చిత్రీకరణ జరిగింది. కొద్దిరోజుల గేప్ తర్వాత సోమవారంనాడు ఓ సాంగ్ చిత్రీకరణ సాగుతోంది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన సెట్లో ఈ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. ఇటీవలే చిరంజీవి, నయనతార, ఇతర ప్రధాన తారాగణం కీలకమైన టాకీ పార్ట్ షూటింగ్ చేశారు.
 
ఇక నేటి నుంచి మెగాస్టార్ చిరంజీవి, నయనతారలపై ఒక పాట చార్ట్‌బస్టర్, మాస్-అప్పీల్ ట్రాక్‌లను అందించడంలో పాపులరైన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్‌ను రూపొందించారు. ఈ పాటను డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి కొరియోగ్రఫీ చేస్తారు. ఫస్ట్ లుక్, గ్లింప్స్, వినాయక చవితి స్పెషల్ పోస్టర్ అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. చిరంజీవిని స్టైలిష్ బెస్ట్ అవతార్‌లో ప్రజెంట్ చేయడం అభిమానులని అలరించింది. 
 
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా, ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలుగా ఉన్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు.
మేకర్స్ ఇటివలే అనౌన్స్ చేసినట్లుగా 2026 సంక్రాంతి పండుగకు వస్తున్నారు.
 
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, విటివి గణేష్
 
రచన, దర్శకత్వం - అనిల్ రావిపూడి
నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - శ్రీమతి అర్చన
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
డీవోపీ - సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ - తమ్మిరాజు
రచయితలు - ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కృష్ణ
VFX సూపర్‌వైజర్ - లవన్ & కుషన్ (DTM), నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ గారపాటి
ఎడిషినల్ డైలాగ్స్ - అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ - సత్యం బెల్లంకొండ
PRO - వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా