గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 1 సెప్టెంబరు 2022 (11:17 IST)

లైగర్ ట్రెయిలర్ చూడగానే ఈ సినిమా చూడాలనిపించలేదు: తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్

Vijay Devarakonda
లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీనిపై ప్రేక్షకులు మీమ్స్ పెడుతూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో లైగర్ చిత్రం ఫలితంపై నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేసారు.

 
tammareddy
లైగర్ గురించి నేను ఎక్కువగా మాట్లాడను. నేను పూరీ అభిమానిని. ఆయన సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం. ఐతే లైగర్ ట్రైలర్ చూసినప్పుడే చిత్రాన్ని చూడాలని నాకనిపించలేదు. ఒకవేళ భవిష్యత్తులో చూడాలని నాకు అనిపిస్తే అప్పుడు చూస్తా అంటూ వ్యాఖ్యానించారు.

 
చిటికెలు వేసి ఎగిరిపడితే సినిమాలు ఆడవు. కష్టపడి చిత్రాన్ని తీసాము చూడండి అంటూ ఏదయినా చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎగిరిపడితే ఫలితం ఇలాగే వుంటుంది. సినిమా తీసి ఎగిరిపడటం చేయకూడదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.