మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (08:17 IST)

దుబాయ్ స్టేడియంలో విజ‌య్‌దేవ‌ర‌కొండ

Vijaydevarakonda at Stadium
Vijaydevarakonda at Stadium
క‌థానాయ‌కుడు విజ‌య్‌దేవ‌ర‌కొండకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. త‌ను సినిమాల‌కు రాక‌ముందునుంచే స్నేహితుల‌తో క‌లిసి గ‌ల్లీ క్రికెట్ ఆడేవాడు. పెళ్లిచూపులు సినిమా స‌క్సెస్ అయ్యాక కూడా వీధిలో చిన్న పిల్ల‌లో క్రికెట్ ఆడి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాడు. అర్జున్ రెడ్డి విజ‌య‌వంతం అయ్యాక కూడా ఆడుతుంటే అభిమానుల పోటెత్త‌డంతో ఆడ‌లేక‌పోయాడు. ఇక తాజాగా లైగ‌ర్ సినిమా విడుద‌లైంది. క‌లెక్ష‌న్ల మాట ఎలా వున్నా. డివైడ్ టాక్ రావ‌డంతో కాస్త రిలీఫ్ కోసం దేవాల‌యాల సంద‌ర్శ‌నం చేశారు.
 
Vijaydevarakonda at Stadium
Vijaydevarakonda at Stadium
ఇక నిన్న ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి దాయాదుల పోరు జరిగింది. యూఏఈ వేదికగా  ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో భారత్ విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌ను దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం నుండి భారతదేశం vs పాకిస్తాన్ T20 మ్యాచ్ (ఆసియాకప్) ప్రత్యక్షంగా చూశారు. ఈ విష‌యాన్ని జాతీయ మీడియా హైలైట్ చేస్తూ చూపించింది. కాగా, విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ర‌లా పూరీ జ‌గ‌న్నాథ్‌తో జ‌న‌గ‌న‌మ‌ణ సినిమా చేయ‌నున్నారు.