ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (21:25 IST)

విజ‌య్‌దేవ‌ర‌కొండ‌కు మ‌హిళ‌లు బ్రహ్మ‌ర‌థం

vijaydevakonda-youth
vijaydevakonda-youth
టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మ‌హిళ‌ల ఆద‌ర‌ణ మామూలుగా లేదు. దేశంలో ఎక్క‌డికి వెళ్ళినా కొండ మాట్లాడే తీరు, అతడి డైలాగ్ డెలివ‌రీకి ఫిదా అయిపోతున్నారు. సోమ‌వారం సాయంత్రం  గుజ‌రాత్ ప‌రూల్ యూనివ‌ర్శిటీలో లైగ‌ర్ టీమ్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మ‌హిళ‌లు భారీ పూల‌మాల‌తో స‌త్క‌రించారు. ఓ ద‌శ‌లో ఓ అభిమాని అత‌న్ని కౌగిలించుకుని ఆనంద‌బాష్పాలతో ఏడ్చేసింది. త‌నంటే పిచ్చి అన్నంత‌గా బిహేవ్ చేయ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.
 
గుజరాత్ వ‌డోద‌రాలో  విద్యుద్దీపనమైన రిసెప్షన్‌కు మేము మీ కోసం కృతజ్ఞతలు తెలుపుతున్నాము అంటూ అక్క‌డి యువ‌తీయువ‌కులు ప్ల‌కార్డ్‌లు ప‌ట్టుకుని మ‌రీ ఆహ్వానం ప‌లికారు. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు చిత్ర‌సీమంలో ఇలాంటి ఆద‌ర‌ణ ఏ సినిమాకూ రాలేదు. ఒక‌ప్పుడు మెగాస్టార్ చిరంజీవికి మాత్ర‌మే తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. కాలం మార్పురీత్యా ఇప్ప‌డు విజ‌య్‌కు మ‌హిళ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం విశేషంగా టాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. ఈనెల 25న దేశ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానున్న ఈ చిత్రం పూరి జ‌గ‌న్నాథ్ అద్భుత‌మైన ప్ర‌మోష‌న్ చేస్తున్నారు.