ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (17:12 IST)

స‌ల్మాన్‌తో కలిసి స్టెప్పులేస్తున్న మెగాస్టార్ చిరంజీవి

Salman Khan, Chiranjeevi
Salman Khan, Chiranjeevi
బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌, తెలుగు మెగాస్టార్ చిరంజీవి క‌లిసి న‌టిస్తోన్న చిత్రం `గాడ్ ఫాద‌ర్‌`. ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఆమ‌ధ్య ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని స‌న్నివేశాల‌ను హైద‌రాబాద్‌లో చిత్రీక‌రించారు. అప్ప‌ట్లో స‌ల్మాన్ హైద‌రాబాద్ వ‌చ్చారు. అయితే ఈసారి చిరంజీవి ముంబై వెళ్ళారు. గురువారం, శుక్ర‌వారంనాడు ఈ చిత్రంలో వీరిద్ద‌రూ క‌లిసి డాన్స్ చేస్తున్న స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

 
ఇందుకు సంబంధించిన లేటెస్ట్ స్టిల్ చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇద్ద‌రు బేక్‌వున్న ఫొటోలో కాలు క‌దుపుతున్న స్టిల్ ఇది. `ది భాయ్‌తో కాలు వణుకుతోంది` అంటూ కాప్ష‌న్ పెట్టారు. ఈ చిత్రంలో ఈ సాంగ్ అభిమానుల‌కు పండుగ‌లా వుంటుంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రాన్ని సూప‌ర్‌గుడ్ మూవీస్‌, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ నిర్మిస్తోంది. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది.