గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 25 జులై 2022 (09:05 IST)

పానీ పూరీ తినిపించుకున్న చిరంజీవి, అమీర్‌ఖాన్‌

chiru-ameer
chiru-ameer
మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ క‌ల‌యిక తెలిసిందే. ఇటీవ‌లే లాల్‌సింగ్‌చ‌డ్డా సినిమాను చిరంజీవి తిల‌కించారు. ఆ త‌ర్వాత ఈ సినిమాను తానే తెలుగులో విడుద‌ల‌చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అందులో భాగంగా ఆదివారంనాడు అమీర్‌ఖాన్ హైద‌రాబాద్‌లో స్టార్ హోట‌ల్‌లో మీడియా స‌మావేశం వేర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాలో ఓ భాగ‌మైన పానీపూరీని ఒక‌రినొక‌రు స్టేజీపైనే తినిపించుకున్నారు.
 
చిరంజీవి మాట్లాడుతూ, చాలా స‌ర్‌ప్రైజ్ థింక్ ఇది. ఇలా నేను పారీ పూరీ తిని చాలా కాలం అయింది. అంటూ జోక్ వేశారు. ప‌క్క‌నే నాగ‌చైత‌న్య‌కూడా వారితో క‌లిసారు. లాల్ సింగ్ చ‌డ్డా అనేది టామ్ క్రూజ్ న‌టించిన ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ సినిమాకు రీమేక్‌. ఇది 1994లో విడుదలై పెట్టుబ‌డికి ఐదింత‌లు రాబ‌ట్టింది. పారామౌంట్ పిక్చ‌ర్స్ నిర్మించింది.
 
  ఓ రోజు అమీర్ నాకు ఫోన్ చేశాడు. లాల్‌సింగ్ చ‌డ్డా చేశాను. తెలుగులో మీ స‌పోర్ట్ కావాలి అని రిక్వెస్ట్ చేశాడు. మీరు రిక్వెస్ట్ చేయ‌ద్దు. మీ స్థాయికి త‌గ‌దు. ఆజ్ఞాపించండి అన్నాను. అని చెప్పారు. ఈ సంద‌ర్భంగా అమీర్‌ఖాన్ మాట్లాడుతూ, చిరంజీవితో త‌న‌కు గ‌ల అనుభ‌వాన్ని గుర్తు చేసుకున్నారు.