గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 జులై 2022 (11:10 IST)

త‌న ప్రెగ్నెన్సీపై వివ‌ర‌ణ ఇచ్చిన కరీనా కపూర్

Kareen post
Kareen post
ప్రస్తుతం కరీనా కపూర్ ప్రెగ్నెన్సీలో వుంద‌ని ప‌లు ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. త‌న భ‌ర్త సైఫ్ అలీ ఖాన్‌తో క‌ల‌సి ఫ్యామిలీ టూర్ విదేశాల‌కు వెళ్ళారు. అక్క‌డ ఓ ఫొటోలో ఆమె క‌డుపు లావుగా వున్న‌ట్లు క‌నిపించింది. దీనితో నెటిజ‌న్టు ఆమెకు గ్రీటింగ్స్ చెబుతూ పోస్ట్ పెట్టేశారు.
 
దీనికి వెంట‌నే ఆమె ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టింది.  ఇది కేవలం పాస్తా, వైన్‌ వల్లే. ప్రశాంతంగా ఉండండి అబ్బాయిలు. నేను గర్భవతిని కాదు. మన దేశ జనాభా కోసం అతను ఇప్పటికే చాలా ఎక్కువ చేశాన‌ని సైఫ్‌ చెప్పాడు' అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌తో ఫ్యాన్స్ కామెంట్‌కు ఫుల్‌స్టాప్ పెట్టింది. తాజాగా కరీనా కపూర్ అమీర్ ఖాన్‌ 'లాల్‌ సింగ్ చద్దా  లో న‌టించింది. నాగ‌చైత‌న్య కూడా ఇందులో న‌టించాడు.