మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2022 (17:28 IST)

హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన విక్రమ్ వేద షూటింగ్ పూర్తి

Hrithik Roshan, Saif Ali Khan,  Pushkar & Gayatri
Hrithik Roshan, Saif Ali Khan, Pushkar & Gayatri
భారతీయ జానపద కథ, 'విక్రమ్ ఔర్ బేతాల్' ఆధారంగా రూపొందుతోన్న చిత్రం  'విక్రమ్ వేద', హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో, రాధికా ఆప్టే ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.  పుష్కర్ & గాయత్రి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం 30 సెప్టెంబర్ 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.
 
ఈ సంద‌ర‌భంగా దర్శకులు పుష్కర్ & గాయత్రి మాట్లాడుతూ,  ప్రముఖ సూపర్‌స్టార్‌లు హృతిక్ & సైఫ్‌లతో షూటింగ్‌ చేయడం చాలా సంతోషకరమైన అనుభవం.  మా అద్భుతమైన సిబ్బందితో, మేము స్క్రిప్ట్ స్థాయిలో అనుకున్నది సాధించగలిగాం మా సినిమాని ప్రేక్షకులకు చూపించడానికి ఎదురుచూస్తున్నాం. 3 సంవత్సరాల తర్వాత యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో పెద్ద తెరపైకి తిరిగి హృతిక్ రోషన్ వ‌స్తున్నారని చెప్పారు. 
 
హృతిక్ తెలుపుతూ, వేదాగా మారడం నేను ఇంతకు ముందు చేసిన దానికి భిన్నంగా ఉంది. నటుడిగా పూర్తి న్యాయం చేశాను. సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే, రోహిత్ సరాఫ్ & యోగితా బిహానీలతో కలిసి పనిచేయడం నటిగా నాకు మరింత ఊపునిచ్చింది అన్నారు.
సైఫ్ అలీఖాన్ మాట్లాడుతూ,  పుష్కర్ & గాయత్రిలో గొప్ప సృజనాత్మక శక్తి దాగివుంది. హృతిక్‌తో కలిసి పని చేయడం, కొన్ని  యాక్షన్ సన్నివేశాలుచేయ‌డం థ్రిల్ క‌లిగించింది అన్నారు.
 
రెండు దశాబ్దాల తర్వాత హై-ఆక్టేన్ యాక్షన్ ఫిల్మ్‌లో ఇద్దరు సూపర్‌స్టార్లు చేయ‌డంతో ఈ చిత్రం అంచనాల‌ను పెంచింది. ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, T-సిరీస్ ఫిల్మ్స్ , రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్, YNOT స్టూడియోస్ సహకారంతో సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం పుష్కర్ & గాయత్రి నిర్వహించారు. నిర్మాతలు ఎస్. శశికాంత్‌. భూషణ్ కుమార్.
ఇంకా ఈ చిత్రంలో రోహిత్ సరాఫ్, యోగితా బిహానీ, షరీబ్ హష్మీ మరియు సత్యదీప్ మిశ్రా కూడా ప్రామిసింగ్ రోల్స్‌లో నటిస్తున్నారు.