గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (12:24 IST)

విజయ్ దేవరకొండ పాదాభివంద‌నం - సారీ చెప్పిన మనోజ్ దేశాయ్

Vijay Devarakonda Padabhivandanam to Manoj Desai
Vijay Devarakonda Padabhivandanam to Manoj Desai
ఇప్పుడు హాట్ టాపిక్ విజయ్ దేవరకొండ. లైగ‌ర్ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా విజయ్ దేవరకొండ ఆట్యిట్యూడ్ గురించి పెద్ద చ‌ర్చ జ‌రిగింది. దీనిపై విజయ్ దేవరకొండ ప‌లువురిని క‌లిసి క్లారిటీ ఇచ్చాడు. ఈ విధానాన్ని చూసిన బాలీవుడ్‌లోని సీనియ‌ర్ విశ్లేష‌కుడు  అశ్వీనీకుమార్ మాట్లాడుతూ.. నా 20 ఏళ్ల ఎంటర్‌టైన్‌మెంట్ జర్నలిజం కెరీర్‌లో, ఎలాంటి అపార్థాన్ని క్లియర్ చేయడానికి ఏ స్టార్ ఇంత దూరం వెళ్లడం నేను చూడలేదు. అంటూ పోస్ట్ చేశాడు.
 
ఈ విష‌య‌మై బాలీవుడ్‌లో థియేటర్లు వున్న ప్ర‌ముఖ ఎగ్జిబిట‌ర్ మనోజ్ దేశాయ్, విజ‌య్‌ను తీవ్రంగా విమ‌ర్శించారు. ఆయ‌న న‌డ‌వ‌డిక మార్చుకోవాల‌నీ, అస‌లు లైగ‌ర్ సినిమాకు విజయ్ దేవరకొండ ప్ర‌ధాన మైన‌స్ అంటూ విశ్లేషించాడు. ఆ త‌ర్వాత సినిమా చూశారు. ఈ సంద‌ర్భంగా విజయ్ దేవరకొండ నిన్న ముంబై వెళ్ళి మ‌నోజ్ దేశాయ్‌కు క‌లిసి ఆయ‌న‌కు పాదాభివంద‌నం చేశారు.
 
అనంత‌రం ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. తాను మొద‌టినుంచి ఎలా వుంటానో, నా నైజం ఏమిటో, నేను అన్న మాట‌లు ఎలా వ‌క్రీక‌రించ‌బ‌డ్డాయో మ‌నోజ్‌కు విజ‌య్ వివ‌రించారు. పిద‌ప మనోజ్ దేశాయ్ మాట్లాడుతూ, విజ‌య్  నిజంగా చాలా మంచి వ్యక్తి, డౌన్ టు ఎర్త్, నేను అతనిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. నేను అతని చిత్రాలన్నీ చూస్తానని వాగ్దానం చేస్తున్నాను. నేను అతనికి అన్ని శుభాలను కోరుకుంటున్నాను” అంటూ ఆశీర్వ‌దించారు. నేను ఇద్ద‌రికి క్ష‌మాప‌ణ కోరుతున్నా.

గ‌తంలో ఖుదాగ‌వా సినిమా టైంలో అమితాబ్‌కు క్ష‌మాప‌ణ చెప్పాను. ఇప్పుడు లైగ‌ర్ ద్వారా విజ‌య్‌కు క్ష‌మాప‌ణ చెబుతున్నానంటూ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్‌.. మ‌నోజ్ ఆప్యాయంగా కౌగ‌లించుకున్నారు. సో. విజ‌య్‌.. మంచిత‌నం సోష‌ల్ మీడియాలో మ‌రో ర‌కంగా రాయ‌డం  ప‌ట్ల ఆయ‌న అభిమానులు చాలా మ‌ద‌న‌ప‌డ్డార‌ని తెలుస్తోంది. దీనితో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇష్యూ స‌ద్దు మ‌ణిగింద‌ని బాలీవుడ్ మీడియా తెలియ‌జేస్తుంది.