గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

విజయ్ దేవరకొండ "లైగర్" చిత్త కలెక్షన్లు - మూడో రోజుకే ఢమాల్

liger movie
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం "లైగర్". ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. తొలి రోజున రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. అయితే, ఈ చిత్రానికి వచ్చిన నెగెటివ్ కారణంగా రెండో రోజు నుంచి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. తొలి రోజు దాదాపు 33 కోట్ల రూపాయల మేరకు కలెక్షన్లు రాబట్టిన లైగర్.. మూడో రోజు వచ్చేసరికి ఇవి రూ.7.5 కోట్లకే పరిమితమయ్యాయి. 
 
పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ప్రతి ఒక్క భాషలోనూ చెత్త రేటింగ్ ఇచ్చారు. సినిమా గురించి వచ్చిన రివ్యూలు ఏమాత్రం సానుకూలంగా లేదు. దీంతో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులే కరువయ్యాయి. ఇది ఆ చిత్ర కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ దెబ్బకు హిందీ వెర్షన్ లైగర్ రిలీజ్ తేదీలో జాప్యమవుతున్నట్టు సమాచారం. 
 
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్యపాండే, మైక్ టైసన్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా ఉండడం తెలిసిందే. కథనం, స్క్రీన్ ప్లే, పాత్రలు మెప్పించేవిగా లేకపోవడం సినిమాకు పెద్ద డ్రాబ్యాక్‌గా తెలుస్తోంది. సినిమా వసూళ్లు ఇక పుంజుకోకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.