ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (17:54 IST)

ప‌ఠాన్ చిత్రంలో జాన్ అబ్ర‌హం స‌రికొత్త అవ‌తారం

John Abraham
John Abraham
ఇండియాలో భారీ చిత్రాల‌ను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘పఠాన్’. బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా విడుద‌లకు ఇంకా 5 నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో సినిమాలో ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తోన్న జాన్ అబ్ర‌హం పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి విడుద‌లైన ప్ర‌తీ అప్‌డేట్ ఫ్యాన్స్, ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన షారూక్ ఖాన్ లుక్‌.. దీపికా ప‌దుకొనె గ్లింప్స్  ఇంట‌ర్నెట్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు జాన్ అబ్ర‌హం పాత్రకు సంబంధించిన లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ప్ర‌తి విష‌యాన్ని రివీల్ చేస్తున్న‌ప్పుడు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. 
 
జాన్ అబ్ర‌హం లుక్ రిలీజ్ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ ‘‘మా ‘పఠాన్’ సినిమా అనౌన్స్ నుంచి రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న వ‌రకు బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌తి విష‌యం ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌ను గొప్ప అనుభూతికి లోను చేసింది. పఠాన్ సినిమాలో బ‌జ్ క్రియేట్ చేసేంత గొప్ప కంటెంట్ ఉండ‌టం మా అదృష్టంగా భావిస్తున్నాం. దీని కార‌ణంగా ఈ సినిమా గురించి అంద‌రూ గొప్ప‌గా మాట్లాడుకోవ‌ట‌మే కాదు.. ఆసక్తిగానూ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో జాన్ అబ్ర‌హం ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తున్నారు. సాధార‌ణంగా విల‌న్‌కు ఇచ్చే ఎలివేష‌న్ గొప్ప‌గా ఉండాలి. అలాగ‌ని హీరో అంత గొప్ప‌గా ఉండాల‌ని నా ఉద్దేశం కాదు. కానీ.. విల‌న్ పాత్ర‌ను గొప్ప‌గా ఆవిష్క‌రించిన‌ప్పుడు హీరో, విల‌న్ మ‌ధ్య పోరు ర‌స‌వ‌త్తంగా ఉంటుంది. ప‌ఠాన్ సినిమాలో షారూక్ ఖాన్‌, జాన్ అబ్ర‌హం మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర‌మైన పోరు ఉంటుంది. అందుక‌నే జాన్ అబ్ర‌హంను సూప‌ర్ స్లిక్ లుక్‌లో మీ ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు.