శనివారం, 12 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (15:08 IST)

విక్రమ్, శ్రీనిధి శెట్టి న‌టించిన చిత్రం కోబ్రా

Vikram, Srinidhi Shetty
Vikram, Srinidhi Shetty
ప్రయోగాత్మక చిత్రాలతో అనేక సూపర్‌హిట్‌లు, బ్లాక్‌బస్టర్‌లను సొంతం చేసుకున్న చియాన్ విక్రమ్, అసాధారణ సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా.. ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
తెలుగు రాష్ట్రాల్లో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల 'కోబ్రా' చిత్రం హక్కులను సొంతం చేసుకున్నారు. ఆగస్ట్ 11న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
 
శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రంలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించడం విశేషం. మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
 
సాంకేతిక  విభాగం విషయానికి వస్తే ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
 
తారాగణం: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు.
సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: ఆర్ అజయ్ జ్ఞానముత్తు, నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్
బ్యానర్: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
విడుదల: ఎన్వీఆర్  సినిమా (ఎన్వీ ప్రసాద్)
సంగీతం: ఏఆర్ రెహమాన్
డీవోపీ: హరీష్ కన్నన్
ఎడిటర్: భువన్ శ్రీనివాసన్