మంగళవారం, 27 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (12:37 IST)

హనుమాన్‌ చాలీసా వింటున్నాడు.. కాంప్రమైజ్‌ మాట అన్నాడు..

Shiva patania
Shiva patania
బుల్లితెర నటి శివ పఠానియా తాను క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఫేస్‌ చేశానని అంటోంది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. 
 
హమ్‌ సఫర్‌ షో ముగిశాక నెక్ట్స్ ఏంటన్నది తోచలేదు. ఎనిమిది నెలల పాటు దిక్కు తోచక ఉండిపోయాను. అలాంటి సమయంలో ఆమెను ఆడిషన్‌కు రమ్మంటూ ఫోన్‌కాల్‌ రాగా ముంబైలోని శాంతాక్రజ్‌లో ఆడిషన్‌ అది చిన్న గది, లోనికి వెళ్లాను. 
 
అక్కడునున్న అతను నువ్వు నాతో ఒకరోజుకి కాంప్రమైజ్‌ అయ్యావంటే పెద్ద స్టార్‌తో యాడ్‌లో నటించేందుకు ఛాన్స్‌ ఇస్తానన్నాడు. విచిత్రం ఏంటంటే అతడు ల్యాప్‌టాప్‌లో హనుమాన్‌ చాలీసా వింటున్నాడు.
 
వెంటనే ఆమె అతడు అడిగిన ప్రశ్నకు గట్టిగా నవ్వేశాను. కొంచెమైనా సిగ్గుందా? భజన పాట వింటూ ఏం అడుగుతున్నావసలు? అని తిట్టేశానని తెలిపింది. ఈ విషయాన్ని తమ ఫ్రెండ్స్‌కు చెప్పి వాళ్లను జాగ్రత్తగా వుండమన్నానని వెల్లడించింది.